Akshaya Patra వంటగది మౌలిక సదుపాయాలు

Akshaya Patra ఫౌండేషన్ దేశంలోని 12 రాష్ట్రాల్లో మరియు 2 యూనియన్ భూభాగాలు 51 వంటశాలల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

కేంద్రీకృత వంటగదులు అనేవి.. 1,00,000 భోజనాలు వండే సామర్థ్యం కలిగిన భారీ స్థాయి వంటగదులు. ఈ వంటగదులు.. ఆ యూనిట్ పరిసరాల్లో ఉన్న అనేక పాఠశాలలకు ఆహారం సరఫరా చేస్తుంటాయి. ఇవి ఆటోమేటెడ్ గా ఉంటాయి.. ఫలితంగా వంట వండే సమయంలో శుభ్రత పాటించబడుతుంది. మరోవైపు, భారీ స్థాయి మౌలిక సదుపాయాల నిర్మాణానికి అనుకూలించని విధంగా, తగిన రహదారులు లేకపోవడం మరియు క్లిష్టమైన భౌగోళిక స్వరూపం కలిగిన ప్రాంతాలు వంటి సమస్యలున్న ప్రాంతాల్లో.. వికేంద్రీకృతమైన వంట గది విధానం ఆదర్శనీయమైన పరిష్కారం. Akshaya Patra వారి వంటగది ప్రక్రియ మరియు కార్యాచరణ విధాన పర్యవేక్షణ, మార్గదర్శనంలో ఈ వంటగదులను మహిళా స్వయం సహాయక బృందాలు(ఎస్ హెచ్ జీలు) నిర్వహిస్తాయి.

Akshaya Patra వంటగదులు.. ఆరు సిగ్మా పద్ధతులను పాటిస్తున్నాయి

కేంద్రీకృత యూనిట్లలో వంట వండడం పొదుపొద్దున్నే మొదలవుతుంది. సంస్థ నిర్వహించే అన్ని వంట గదులూ.. ఒక షెడ్యూల్ చేయబడిన మెనూను పాటిస్తాయి. వంట పాత్రలు, ట్రాలీలు, బియ్యం జారుడు బల్లలు, పప్పు/సాంబారు ట్యాంకులు, కటింగ్ బోర్డులు, చాకులు మరియు ఇతర సంబంధిత వస్తువులు అన్ని కేంద్రీకృత వంటగదుల్లో ఉంటాయి. ఉపయోగించే ముందు వీటన్నింటినీ శుభ్రపరుస్తారు. ఉత్తర భారతదేశంలోని వంటగదుల్లో బియ్యం వండే పాత్రలు మరియు పప్పు వండే పాత్రలు ఉంటాయి. ప్రతి బియ్యం వండే పాత్రా కనీసం 500 లీటర్ల సామర్థ్యం కలిగి ఉంటుంది; మరియు ప్రతి పప్పు వండే పాత్రా.. 1200 లీటర్ల నుంచి 3000 లీటర్ల పప్పు వండే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఉత్తర భారతదేశ మెనూలో రోటీ అన్నది భాగమైన నేపథ్యంలో, వంటగదుల్లో రోటీ తయారీ యంత్రాలు ఉంటాయి. ఇవి 6000 కిలోల గోధుమ పిండి నుంచి 2,00,000 రోటీలను తయారు చేసే సామర్థ్యం కలిగి ఉంటాయి.

దక్షిణ భారత వంటశాలల్లో అన్నం వండే పాత్రలు మరియు సాంబారు వండే పాత్రలు ఉంటాయి. ప్రతి అన్నం పాత్రా.. కనీసం 500 లీటర్ల సామర్థ్యం కలిగి ఉంటుంది; ప్రతి సాంబారు పాత్రా.. 1,200 లీటర్ల నుంచి 3,000 లీటర్ల సాంబారు తయారీ సామర్థ్యం కలిగి ఉంటుంది. అన్ని పాత్రలూ 304 ఆహార రకం స్వచ్ఛమైన ఉక్కుతో తయారు చేయబడతాయి.

ముడి సరుకులు సేకరించేటపుడు నాణ్యతకు భరోసా

ఈ ఎస్ క్యూఎంఎస్ ప్రక్రియలో.. పంపిణీదారు ఎంపిక, పంపిణీదారు అర్హతలు, పంపిణీదారు రేటింగ్ వంటి ఉప ప్రక్రియలు ఉంటాయి. మంచి, అత్యుత్తమ నాణ్యత కలిగిన ముడి సరుకులను సేకరించేందుకు ఇవి దోహదం చేస్తాయి. ముడి సరుకులు సంబంధిత ప్రమాణాలన్నింటికీ తగిన విధంగా ఉన్నాయా లేదా అన్న పూర్తి స్థాయి నాణ్యతా పరిశీలన అనంతరమే వాటిని అనుమతించేలా మా నాణ్యత నియంత్రణ ప్రక్రియ పనిచేస్తుంది. ఆహార భద్రత ప్రమాణాల చట్టం 2006(ఎఫ్ఎస్ఎస్ఏ)లో పేర్కొన్న ఈ నాణ్యతా ప్రమాణాలు అమలు చేస్తున్నాం.

ముడి సరుకుల నిల్వ, నిర్వహణ, రక్షణ

తాజా కాయగూరలను రోజువారీ ప్రాతిపదికన సేకరిస్తారు. సేకరించాక, మంచి నాణ్యత కలిగిన వాటి కోసం కాయగూరలను ప్రత్యేకంగా వేరుచేస్తారు. కోయడానికి ముందు ఆ కాయగూరలన్నింటినీ నీటితో చక్కగా శుభ్రపరుస్తారు. అప్పటికప్పుడు వండుకోవడానికి సిద్ధంగా ఉండేలా కోసిన కాయగూరలు తాజాదనం కోల్పోకుండా ఉండడానికిగాను శీతల గిడ్డంగిలో పెడతారు. బియ్యంను భారత ఆహార సంస్థ(ఎఫ్ సీఐ) సరఫరా చేస్తుంది. వంట వండడానికి ముందు, బియ్యాన్ని యంత్రంలో శుభ్ర పరిచి, నీటితో శుభ్రంగా కడుగుతారు. అన్ని ముడి సరుకులూ తాజాగా ఉండేలా చూడడం కోసం, ముడిసరుకులను ప్రొడక్షన్ కు పంపేటపుడు ఎఫ్ఐఎఫ్ఓ(మొదటి వచ్చింది మొదట వెళ్లేలా) మరియు ఎఫ్ఈఎఫ్ఓ(మొదట చెడిపోయేది మొదట వెళ్లేలా) పద్ధతులను అన్ని వంటశాలలూ అవలంభిస్తాయి.

అలా చేయడం వల్ల, వంటశాలలు ముడి సరుకులను సరిగా గుర్తించగలవు, నిల్వ చేయగలవు మరియు తగిన పద్ధతిలో తిరిగి తీసుకోగలవు.

వండే సమయంలో నాణ్యత మరియు భద్రత

Akshaya Patraకు చెందిన వంటగదులన్నీ మధ్యాహ్న భోజనం వండే విషయంలో ఒక ప్రమాణిక ప్రక్రియ పాటిస్తాయి. వండే ఆహారం నాణ్యత, శుభ్రత ఉండేలా చూసేందుకు, ఆహార భద్రత ప్రమాణాలకు అనుగుణంగా అవి ఉండేలా చూసేందుకు ఈ ప్రక్రియ పాటిస్తాయి. వంట వండడానికి ముందుగా.. వంట పాత్రలు, ట్రాలీలు, బియ్యం జారుడు బల్లలు, సాంబారు/పప్పు ట్యాంకులు, కటింగ్ బోర్డులు, చాకులు వంటి వంట సామానులన్నిటినీ ఆవిరి ద్వారా శుభ్ర పరుస్తారు. వంటశాలల్లో ఉపయోగించే పాత్రలన్నీ.. 304 రకం స్వచ్ఛమైన ఉక్కుతో తయారు చేయబడినవి, వంటకు, ఆహారాన్ని మోయడానికి అనువైనవి.

చపాతీ పాన్లు, అన్నం, పప్పు వండే పాత్రలు, పాఠశాలలకు ఆహారం మోసుకెళ్లడానికి అనువైన పాత్రాలు వంటి అవసరమైన వంట సామాన్లు వికేంద్రీకృత వంటశాలల్లో ఉంటాయి. శుభ్రతా ప్రమాణాలు ఎల్లవేళలా పాటించేలా చూసేందుకుగాను వంటశాలల సిబ్బందికి తరచు స్వీయ శుభ్రత జాగ్రత్తలు మరియు ఆహార భద్రతలపై శిక్షణ ఇస్తుంటాం.

ఉత్పత్తిని పర్యవేక్షించడానికి మరియు నిర్వహించడానికి అన్ని వంటశాలల్లోనూ ఉత్పత్తి పర్యవేక్షకులు, బాగా ఆరితేరిన వంటగాళ్లు ఉంటారు. ఆహారం తగిన నాణ్యతతో ఉండేలా చూసేందుకు వంట ఉష్ణోగ్రత వంటి క్లిష్ట నియంత్రణ పాయింట్ల(సీపీపీలు)ను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి నిర్ణీత సమయాల్లో రికార్డు చేస్తుంటారు.

ఆహారంలో నాణ్యత ఉండేలా చూసేందుకు, ప్రతి వంట గదిలో నాణ్యతా అధికారులు నాణ్యత తనిఖీలు చేస్తుంటారు.

ఆహారం ప్యాకింగ్ మరియు రవాణా

ఆవిరితో స్టెరిలైజ్ చేసిన పాత్రల్లో వండిన ఆహారాన్ని ప్యాక్ చేస్తారు. 304 రకం స్వచ్ఛమైన ఉక్కుతో రూపొందించిన పాత్రల్లో ప్యాక్ చేసిన ఆహార రవాణాకు మేం ప్రత్యేకంగా డిజైన్ చేసిన, మార్పులు చేసిన వాహనాలు వాడతాం. పిల్లలకు పెట్టే వరకు ఆహారం తాజాదనాన్ని కోల్పోకుండా ఉండడానికి, పాత్రలు అటూ ఇటూ తొణకకుండా ఉండడానికి ఈ వాహనాలు తేనెపట్టులాంటి నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. వేడి పోకుండా ఉండడానికి ఈ వాహనాలు ఉబ్బిన విధమైన ఆకృతిని కలిగి ఉంటాయి.

డెలివరీ

భద్రతతోపాటు తగిన సమయంలోపు డెలివరీ చేసేలా ఆయా డెలివరీ వాహనాలను ట్రాకింగ్ చేయడానికి జీపీఆర్ఎస్, అలాగే మార్గాల ఆప్టిమైజేషనుకు లాజిస్టిక్ చార్టింగ్ వంటి పద్ధతులను క్రమేణా అందిపుచ్చుకుంటూ వాటిని వంటగదుల్లో అమలుచేస్తున్నాం.

డెలివరీ ప్రక్రియ తరువాత

ఆహార నాణ్యత నిలకడగా ఉండేలా చూసేందుకు, ఆహారాన్ని డెలివరీ చేసేటప్పుడే మేం ఆయా పాఠశాలల నుంచి రోజూ సూచనలు, సలహాలు తీసుకుంటాం. ఆ సూచనలు సలహాలను వంటశాలల్లోని నాణ్యత అధికారులు పరిశీలించి.. ఆహారం నాణ్యత మరియు డెలివరీ విషయంలో సరిదిద్దుకోవాల్సిన చర్యలు లేదా మెరుగుదలకు తీసుకోవలసిన చర్యలు ఉంటే వాటిని అమలు చేస్తారు. మధ్యాహ్న భోజనం పెట్టే సమయంలో శుభ్రత మరియు ఆహార భద్రతకు సంబంధించి అవగాహన కల్పించేందుకుగాను మేం రోజూ పాఠశాలలకు ‘చేయదగినవి’ మరియు ‘చేయకూడనివి’ ఏమిటో చెబుతూ కరపత్రాలను పంచిపెడుతుంటాం.

కీలక ప్రక్రియలు, వ్యవస్థలు, వాటి ప్రతిభను నిరంతరం పర్యవేక్షించే విషయంలో ఆడిట్, సమీక్ష యంత్రాంగాలు కీలక పాత్ర పోషిస్తాయి. అందువల్ల, గుడ్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్రాసెస్(జీఎంపీ) నెలవారీ ఆడిట్లు, ఆహార భద్రత, నాణ్యతపై సర్ ప్రైజ్ ఆడిట్లు వంటి వాటిని మేం ప్రారంభించాం. క్వాలిటీ మెట్రిక్స్ పెర్ఫార్మన్స్ నెలవారీ పద్ధతిలో సమీక్షించబడుతుంది. ఆహారాన్ని డెలివరీ చేసే సమయంలో మేం రోజూ తీసుకునే సూచనలు, సలహాలతోపాటు నిర్ణీత కాల వ్యవధిలో నాణ్యత సిబ్బంది సవివరమైన వినియోగదారుల సంతృప్తి అధ్యయనాలు చేస్తారు. ధృవీకృత వంటశాలల్లో, ఏడాదికి రెండుసార్లు ఐఎస్ఓ 22000 అంతర్గత ఆడిట్లు జరుగుతాయి. నాణ్యత, ఎఫ్ఎస్ఎంఎస్ మేనేజర్ల నేతృత్వంలోని నైపుణ్యం కలిగిన అంతర్గత ఆడిటర్లు వీటిని చేస్తారు. అలాగే మా సర్టిఫికేషన్ మండలి.. ఏడాదికి రెండుసార్లు నిఘా ఆడిట్లు చేస్తుంది. అన్ని సంబంధిత ఆడిట్ల సమాచారం పర్యవేక్షించబడుతుంది మరియు అవసరమైన దిద్దుబాట్లు, మెరుగుదల చర్యలు తీసుకోబడతాయి. అన్ని చర్యలూ సమర్థవంతంగా అమలయ్యే వరకు పర్యవేక్షించబడతాయి.

నిరంతర అభివృద్ధి పద్ధతులు

మేం అందించే మధ్యాహ్న భోజనం నాణ్యత స్థిరంగా కొనసాగించడం ద్వారా మా సేవలను మరింత మెరుగ్గా చేసేలా మరియు కొనసాగించాలన్న లక్ష్యంతో మేం ఉన్నాం. కాబట్టి నిరంతర అభివృద్ధి చాలా అవసరం. వివిధ ప్రక్రియల పురోగతిని నిరంతరం పెంచాల్సిన అవసరం మనకు ఉంది. దాని ద్వారా ప్రతి అభివృద్ధి చక్రం.. తదుపరి స్థాయి విజయానికి దోహదపడుతుంది. మేం ఓ సమగ్ర విధానాన్ని అవలంభించాం మరియు ‘అక్షయ ప్రగతి’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించాం. కార్యక్రమంలో భాగంగా మేం కైజెన్, సీఐ ప్రాజెక్టులు మరియు ఆరు సిగ్మా పద్ధతులను అందిపుచ్చుకుని అమలు చేస్తున్నాం. వాటి ద్వారా ఈ కార్యక్రమంలో ప్రతి సభ్యుడూ భాగస్వామి అయ్యేలా చూస్తున్నాం.

నిరంతర అభివృద్ధి కార్యక్రమంలో శిక్షణ అన్నది అంతర్గత భాగం. 2012-13 ఆర్థిక సంవత్సరంలో.. అన్ని ప్రాంతాల్లోని వంట శాలల సిబ్బందికి ఐఎస్ఓ 22000 అవగాహన కోసం 6000 గంటలకుపైగా శిక్షణ మరియు 5ఎస్, జీఎంపీ, లీన్ మరియు కైజన్ లపై శిక్షణ ఇవ్వబడింది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఇవే అంశాలపై నాణ్యత విభాగం 15000 గంటల శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది.

The Best Way to Make a Difference in the Lives of Others