ఎన్జీవోల పాత్ర

మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ, విస్తరణ విషయంలో ఎన్జీవోలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. మధ్యాహ్న భోజన పథకం మరింత మంది పిల్లలకు చేరేలా అమలు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు Akshaya Patra ఫౌండేషన్ వంటి ఎన్జీవోలతో చేతులు కలుపుతున్నాయి. ఆకలి బాధలకు, పౌష్టికాహార లోపానికి సమాధానం చెప్పే దిశగా చాలా ఎన్జీవోలు కృషి చేస్తున్నాయి.

పథకం మరింత మందికి చేరేలా చేయడంలో, నాణ్యత మెరుగు పరిచే విషయంలో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ) ముఖ్యపాత్ర పోషిస్తోందని నిరూపితమైంది. భాగస్వామ్యానికి సంబంధించి స్వచ్ఛంద సంస్థను ఎంపిక చేసుకునే విషయంలో ప్రభుత్వం చాలా అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది. ఆ సంస్థలు కచ్చితంగా పారదర్శకంగా ఉండాలి, ‘చిత్తశుద్ధితో పనిచేసేవని నిరూపితమై’ ఉండాలి. ఒక ఎన్జీవోను ఎంపిక చేసుకునే విషయంలో లెక్కలోకి తీసుకునే ఎన్పీ-ఎన్ఎస్పీఈ 2004 ప్రమాణాలు ఇవీ:

గ్రెయిన్ గ్రాంటుల నుంచి వండిన ఆహారం వరకు

ఒకసారి ఎంపికయ్యాక, ఆ ఎన్జీవో వంటశాలను ఏర్పాటు చేసి, ఆహార తయారీకి సంబంధించిన రోజువారీ కార్యక్రమాలు చేయాలి. అలాగే దాని నిర్వహణకు అయ్యే ఖర్చులు భరించాలి. ఎన్పీ-ఎన్ఎస్పీఈ,2004 మార్గదర్శకాల ప్రకారం..

‘పాఠశాలల సమూహానికి అవసరమైన కేంద్రీకృత వంటశాల ఏర్పాటు పట్టణ ప్రాంతాల్లో సాధ్యం కావచ్చు. అలాంటి చోట్ల ఎక్కడ వీలైతే అక్కడ అంటే కేంద్రీకృత వంటశాలల్లో వంట వండి.. ఆ ఆహారాన్ని విశ్వసనీయమైన రవాణా వ్యవస్థ ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో వివిధ పాఠశాలలకు చేరవేయాలి. ఒక పట్టణ ప్రాంతంలో తాము వండి పెట్టే పాఠశాలల సామూహాల సంఖ్యను బట్టి.. ఇలాంటి నోడల్ వంటశాల(లు) ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఉండే అవకాశముంది.

ఈ పథకాన్ని మరింత సమర్థంగా అమలు చేసేందుకుగాను, కార్యక్రమం యొక్క లాజిస్టిక్స్ ను ఎన్జీవో బాగా నిర్వహించే సామర్థ్యం కలిగి ఉండాలి. ఆ లాభాపేక్ష లేని సంస్థ ‘అవసరమైన స్థాయిలో మధ్యాహ్న భోజనం సరఫరా చేసే ఆర్థిక, లాజిస్టిక్ సామర్థ్యం’ కలిగి ఉండాలి.

దీన్ని ఎలా సాధించాలన్న విషయంలో ప్రభుత్వం ఒక పరిష్కారం చూపింది. మానవ వనరుల శాఖ చెప్పిందిలా:

‘‘అర్హత కలిగిన పాఠశాలల్లో వండిన ఆహారం లేదా వండడానికి వీలైన ఆహార రకం పంపిణీని ఎన్జీవోల మద్దతుతో చేపట్టడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలే ఈ పథకం అమలు పూర్తి బాధ్యత తీసుకోవాలి. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, ఎన్జీవోలు.. ఆహార ధాన్యాలను వండిన ఆహారంగా చేసేందుకు అవసరమైన వనరులను సమకూర్చుకోవచ్చు’’.
                                        -అనుబంధం IX పారా 7లోని మార్గదర్శనాలు

Akshaya Patraవంటి సంస్థలు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పథకాన్ని అమలు చేసేందుకుగాను భారీ స్థాయి మౌలిక సదుపాయాలు నెలకొల్పుకోవడానికి పైన పేర్కొన్న పరిష్కారం అనుమతి ఇస్తుంది. Akshaya Patraకు దేశవ్యాప్తంగా ఉన్న వంటశాలల విలువ దాదాపు రూ.8 కోట్లు ఉంటుంది. పథకం అమలు సమయంలో తలెత్తే లోటును భర్తీ చేసుకోవడానికి ఎన్జీవోలు నిధులు సేకరించుకోవచ్చని మార్గదర్శకాలు చెబుతున్నాయి.

2008-09 ప్రోగ్రామ్ అప్రూవల్ బోర్డు సమావేశంలోని మినిట్లు చెబుతున్నదిదీ.. ‘‘ఇతర ఖర్చులు అంటే.. వంట పారితోషికం, పాత్రలు, వంటశాలల నిర్మాణం, రవాణా వంటి వాటి వ్యయాలు ఎన్జీవోలే భరించాలి.’’

విరాళాల సేకరణకు కూడా ప్రభుత్వం అనుమతిచ్చింది. ఉదాహరణకు 2003లో భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో జరిగిన ఓ సమావేశం(భారత ప్రభుత్వంలోని ఆర్థిక శాఖ, రెవెన్యూ విభాగం, సామాజిక, ఆర్థిక సంక్షేమాల ప్రోత్సాహంపై జాతీయ కమిటీ).. రూ.22 కోట్ల వరకు విరాళాలు సేకరించుకునే అర్హత కలిగిన ప్రాజెక్టును Akshaya Patra చేపట్టవచ్చని సిఫార్సు చేసింది. విరాళాలు ఇచ్చిన దాతలకు మూడేళ్ల వరకు 100% పన్ను రాయితీ ఇస్తారు.

2006లో Akshaya Patra కార్యక్రమాన్ని ఆ కమిటీ మరోసారి సమీక్షించింది. పన్ను లేని విరాళాలు సేకరించుకునే మొత్తాన్ని రూ.100 కోట్లకు పెంచింది. 2009లో జరిగిన మరో సమీక్షలో మూడేళ్ల కాలానికి విరాళాల మొత్తాన్ని రూ.200 కోట్లకు పెంచింది.

ఎన్జీవోలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో ద్విముఖ వ్యూహం ఉంది. అలా చేయడం వల్ల, అది పథకం నాణ్యతను మెరుగుపరచడమే కాకుండా, కమ్యూనిటీ భాగస్వామ్యాన్ని కూడా ప్రోత్సహిస్తుంది. ఎన్పీ-ఎన్ఎస్పీఈ 2004 మార్గదర్శకాల ప్రకారం, ‘కమ్యూనిటీ మరింత చురుగ్గా పాల్గొనడానికి, తద్వారా మధ్యాహ్న భోజన పథకం ప్రజల పథకంగా మారడానికి వీలుగా.. కొన్ని ప్రక్రియలను ప్రారంభించాలి.’

చురుకైన వాలంటీరింగ్, నిధుల సేకరణ ద్వారా ఎన్జీవోలు కమ్యూనిటీ భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తున్నాయి. సమాజంలోని అన్ని వర్గాలకూ ఇందులో భాగస్వామ్యం కల్పించి మధ్యాహ్న భోజన పథకాన్ని ‘ప్రజల పథకం’గా చేసేలా ప్రభుత్వానికి సాయం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలూ ఎన్జీవోలు తీసుకుంటున్నాయి.

పారద్శకత పాటించండం

ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో కార్యక్రమాల పారద్శకతపై ఇప్పుడు ప్రశ్న తలెత్తవచ్చు. జాతీయ స్థాయి స్టీరింగ్ కమ్ మానిటరింగ్ కమిటీ(ఎన్ఎస్ఎంసీ) ఒకటి ఈ పథకం పర్యవేక్షణ, నిర్వహణ బాధ్యతలు చూస్తుంది. ఎన్పీ-ఎన్ఎస్పీఈ, 2004 ప్రకారం.. కమిటీ విధులు ఇవీ:

•    ‘పథకానికి అవసరమైన ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, కమ్యూనిటీ మద్దతు కూడగట్టడం’
•    ‘పథకం అమలును పర్యవేక్షించడం, దాని ప్రభావాన్ని లెక్కించడం, తగిన దిద్దుబాటు చర్యలు తీసుకోవడం’

అర్హతా నిబంధల్లో ఒకటి ఏమిటంటే ‘అసోసియేషన్ లేదా సంస్థ వ్యవహారాలు నిర్వహించే వ్యక్తులు.. నిరూపితమైన చిత్తశుద్ధిని కలిగి ఉండాలి’ (భారత ప్రభుత్వంలోని సామాజిక మరియు ఆర్థిక సంక్షేమాన్ని ప్రోత్సహించే జాతీయ కమిటీ). ‘ఆ అసోసియేషన్ లేదా సంస్థ.. రసీదులు, ఖర్చుల రోజువారీ అకౌంట్లు నిర్వహించాలి’ అన్నది మరో నిబంధన. స్వచ్ఛంద సంస్థ రోజువారీ నివేదికలు కచ్చితంగా సమర్పించాలి.

ఫలితాలు

మధ్యాహ్న భోజన పథకం అమలులో పలు ప్రైవేటు సంస్థలు చొరవ తీసుకోవడంతో.. పథకం మంచి ఫలితాలు కనబరిచింది.

  • ఈ పథకం కింద ఇంతవరకు దాదాపు 12 కోట్ల మంది పిల్లలు లబ్ధి పొందుతున్నారు. ప్రపంచంలోకెల్లా అత్యంత భారీ ఆహార పథకం ఇదే. ప్రభుత్వ ద్విముఖ వైఖరి.. అద్భుతమైన ఫలితాలు సాధించడానికి దోహదపడింది.
  • దేశంలోని పిల్లలందరికీ సహాయం చేయడంలో ప్రభుత్వం సమాజాన్ని విజయవంతంగా భాగస్వామిని చేసింది. Akshaya Patra లాంటి పలు సంస్థల వనరులను ఉపయోగించుకోవడం ద్వారా అంటే వాటిని పథకం అమలు చేసే విభాగాలుగా చేయడం ద్వారా మరియు అవి వీలైన మేర స్వీయ సమృద్ధి సాధించే అవకాశాలు కల్పించడం ద్వారా ఇది సాధ్యమైంది. నిధుల సేకరణ మరియు వాలంటీరింగ్ ద్వారా ఈ ఫౌండేషన్లు కమ్యూనిటీ భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తాయి.
  • ప్రభుత్వం ప్రోత్సహించిన.. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం.. పథకం విజయవంతమయ్యేలా చూడడంలో కీలక పాత్ర పోషించింది. ఈ సంస్థల సహాయంతో, ఈ పథకాన్ని భారీ స్థాయిలో ప్రభుత్వం అమలు చేయగలుగుతోంది.
  • ఈ పథకం పిల్లలపై చాలా రకాలుగా ప్రభావం చూపింది. హాజరు పెరిగింది, తరగతి గదుల్లో ఆకలి బాధలు తగ్గాయి, పౌష్టికాహార లోపం నియంత్రించబడింది మరియు అన్ని సామాజిక వర్గాల పిల్లల్లో సామాజిక భావన పెంపొందింది.
  • ప్రపంచ వ్యాప్తంగా పరిశీలిస్తే, సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి భారత ప్రభుత్వంతో ఎంతో కృషి చేస్తోంది.

The Best Way to Make a Difference in the Lives of Others