Akshaya Patra ఫౌండేషన్ (TAPF) అనేది ప్రజా, సేవా, లౌకిక సంస్థ. బెంగళూరులో రిజిస్టర్ అయింది. దీని పాలక మండలిలో బెంగళూరు ఇస్కాన్ మిషనరీలు, కార్పొరేట్ ప్రొఫెషనల్స్, పారిశ్రామికవేత్తలు ఉన్నారు.
సంస్థ వ్యవస్థాగత నిర్మాణాన్ని కింద ఇచ్చాం. చక్కగా నిర్దేశించిన విధానాల ద్వారా సంస్థ సజావుగా పని చేయడానికి ఇది దోహదం చేస్తుంది
బోర్డు కూర్పు
Akshaya Patraలో, ఏ స్వచ్ఛంద సంస్థకు అయినా సుపరిపాలన, నైతిక విలువలు మూలస్తంభాలని మేం బలంగా విశ్వసిస్తాం. దానిని సాధించే క్రమంలోనే, సంస్థ కార్యకలాపాలు, సుపరిపాలన అందించడంలో ఫౌండేషన్ పాలక మండలి సభ్యులు కీలక పాత్ర పోషిస్తారు.
ఫౌండేషన్ బోర్డులో బోర్డ్ ఆఫ్ ట్రస్టీలతోపాటు బోర్డ్ ఆఫ్ అడ్వైజర్లు కూడా ఉంటారు. ప్రస్తుతానికి బోర్డులో ఎనిమిదిమంది ట్రస్టీలు, ఏడుగురు సలహాదారులు ఉన్నారు. వాళ్లు..