Akshaya Patraలో పరిపాలనా విధానం కొన్ని చట్టాలు, నిబంధనలు, మంచి సంప్రదాయాలను అనుసరించి ఉంటుంది. సంస్థ సమర్థంగా, నైతికంగా పని చేయడానికి ఇది వీలు కల్పిస్తుంది. దానిలోని భాగస్వాములు అందరికీ విలువ తెస్తుంది.
Akshaya Patra ఫౌండేషన్లో, పరిపాలనకు సంబంధించి మంచి విధానాలను అవలంబిస్తే సంస్థ సుదీర్ఘ కాలం కొనసాగుతుందని మేమంతా గట్టిగా విశ్వసిస్తున్నాం. ప్రపంచస్థాయి స్వచ్ఛంద సంస్థగా ఉండాలని ఆకాంక్షించడమే కాదు.. ప్రపంచ స్థాయి పరిపాలన విధానాన్ని అమలు చేయాలన్న కృత నిశ్చయం మా అందరిలో ఉంది.
పరిపాలనకు సంబంధించి మేం అమలు చేసే విధానాలు ధర్మకర్తృత్వం సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. మన నైతిక విలువలు వ్యవస్థలోకి బలంగా చొచ్చుకొనిపోయాయి. మా మూల సిద్ధాంతం నాలుగు సూత్రాల మీద ఆధారపడి ఉంది.:
• ఫౌండేషన్ మరియు భాగస్వాములకు బోర్డు జవాబుదారీగా ఉండడం
• భాగస్వాములందరినీ సమానంగా చూడడం
• బోర్డు ద్వారా వ్యూహాత్మక సూచనలు ఇస్తూనే సమర్థంగా పర్యవేక్షించడం
• పారదర్శకత మరియు సమయానికి వెల్లడించడం.
ఈ సిద్ధాంతంతోపాటు, పరిపాలనకు సంబంధించి అత్యుత్తమ విధానాలను అవలంబించడం ద్వారా అగ్రస్థానంలో ఉండాలని Akshaya Patra ఫౌండేషన్ నిరంతరం తపిస్తూ ఉంటుంది.
విజయవంతమైన ప్రభుత్వ – ప్రైవేటు భాగస్వామ్యం
కేంద్ర ప్రభుత్వంతోపాటు వివిధ రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఈ ప్రోగ్రామ్ ను నిర్వహించడం జరిగింది. మధ్యాహ్న భోజన పథకాన్ని విజయవంతంగా నిర్వహించడానికి వారు ఆహార పదార్థాలు, నగదు రాయితీలను ఇవ్వడం ద్వారా మాకెంతో సహకరించారు. దీనికితోడు, కార్పొరేట్ కార్యాలయాలు, వ్యక్తిగతంగా దాతలు కూడా విరివిగా విరాళాలు అందజేశారు.