ప్రభావ అధ్యయనం

Akshaya Patra Foundation యొక్క విజన్ స్టేట్ మెంట్... ఆహారం మరియు విద్య మధ్య స్పష్టమైన సంబంధాలను నెలకొల్పింది. తన విజన్ లో మొదటి అడుగుగా ఫౌండేషన్ 2000లో పాఠశాలల్లో మధ్యాహ్న భోజన ఆహారం అందించడం మొదలుపెట్టింది. తర్వాత, 2003లో మధ్యాహ్న భోజన పథకం అందించడాన్ని భారత ప్రభుత్వం తప్పనిసరి చేయడంతో, ప్రభుత్వ బడుల్లో వండిన ఆహారం పెట్టడానికి Akshaya Patra ప్రభుత్వంతో భాగస్వామి అయింది. తరగతి గదుల్లో ఆకలికి పరిష్కారంగా ప్రభుత్వంతో కలిసి పనిచేయడం.. సంస్థకు ఆహ్వానించదగిన పురోగతి.

మధ్యాహ్న భోజన పథకం అమలు విషయంలో Akshaya Patraతో ఈ ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం.. కేంద్ర మధ్యాహ్న భోజన పథకంలోని ఆరు లక్ష్యాలను సాధించడంలో విజయవంతమైంది.

impact-of-the-akshaya-patra-foundation

  • తరగతి గదుల్లో ఆకలి లేకుండా చేయడం
  • పాఠశాలల్లో ప్రవేశాలు పెంచడం
  • పాఠశాలల్లో హాజరు పెంచడం
  • సామాజిక వర్గాల మధ్య సామాజిక భావన పెంపొందించడం
  • పౌష్టికాహార లోపాన్ని తగ్గించడం, మరియు
  • మహిళా సాధికారత

మధ్యాహ్న భోజన పథకం ఆరు లక్ష్యాలను సాధించడంలో ఫౌండేషన్  ఏ మేరకు విజయవంతమైందన్నది తెలుసుకోవడానికి, పలు సంస్థలు ప్రభావ అధ్యయనాలు నిర్వహించాయి. ఆ ప్రభావ అధ్యయనాలు ఈ విధంగా ఉన్నాయి:

ఏ.సీ నీల్సన్ అధ్యయనం

హార్వర్డ్ కేస్ స్టడీ

ప్రభుత్వ అధ్యయనాలు
గవర్నెన్స్ నాలెడ్జ్ సెంటర్:
మానవ వనరుల అభివృద్ధి శాఖ:
        - రాజస్థాన్ లోని మధ్యాహ్న భోజన కార్యక్రమం పరిస్థితి విశ్లేషణ
        - కర్ణాటకలోని అక్షర దాసోహ పథకం పై నివేదిక

The Best Way to Make a Difference in the Lives of Others