Akshaya Patra ఫౌండేషన్ చరిత్ర

కరుణతో కూడిన ఒక కథతో ఫౌండేషన్ చరత్ర ప్రారంభమైంది

కలకత్తా దగ్గరలోని మాయాపూర్ అనే గ్రామంలో ఒకరోజు చెత్తలో పడేసిన ఆహారం కోసం కుక్కలతో కొంత మంది పిల్లలు పోట్లాడడాన్ని దైవాంశసంభూతులైన భక్తివేదాంత స్వామి ప్రభుపాద ఒక కిటికిలో నుంచి చూశారు. అది చిన్నగా అనిపించినా, హృదయాన్ని కదిలించి వేసే ఆ సంఘటన నుంచి ఒక గట్టి నిర్ణయం పుట్టింది. అది మా కేంద్రానికి చుట్టుపక్కల 10 కిలో మీటర్లలోపు పిల్లలెవరూ ఆకలితో పస్తుండకూడదు అని.

ఆయన స్ఫూర్తిదాయక పరిష్కారం, ఈ రోజు ఉన్న Akshaya Patra ఫౌండేషన్ స్థాపించేలా మాకు సహకరించింది.  

కర్ణాటకలోని బెంగళూరులో 2000 జూన్ లో Akshaya Patra ఆయన స్ఫూర్తిదాయక పరిష్కారం, ఈ రోజు ఉన్న Akshaya Patra ఫౌండేషన్ స్థాపించేలా మాకు సహకరించింది మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించింది. తొలి నాళ్లలో ఆ పథకాన్ని అమలు చేయడం సంస్థకు అంత సులువు కాలేదు. కానీ, మోహన్ దాస్ పాయ్ సహాయ సహకారాలతో త్వరలోనే ఆ కార్యక్రమాలు గాడిన పఢ్డాయి. ఆయన పాఠశాలలకు భోజనం చేరవేసే తొలి వాహనాన్ని బహూకరించారు. మరియు అభయ్ జైన్ అనే ఆయన సంస్థ కార్యక్రమాలు విస్తరించడానికి మరింత మంది దాతలను తీసుకువస్తానని మాట ఇచ్చారు.

గొప్ప సంకల్పాన్ని సాధించే దిశగా, ‘‘దేశంలో బాలలెవ్వరూ ఆకలి కారణంగా విద్యకు దూరం కాకూడదు’’ అన్న విజన్ ను పథకం స్వీకరించింది.

బెంగళూరులోని ఐదు ప్రభుత్వ పాఠశాలల్లో 1,500 మంది పిల్లలకు అన్నం పెట్టడంతో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభమైంది.

ఎంతో మంది మానవతావాదులు, భారత ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో సంస్థ ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్దదైన మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వహిస్తోంది. ప్రభుత్వ, ప్రయివేట్ భాగస్వామ్యంతో పాటు Akshaya Patra మంచి నిర్వహణ, నూతన సాంకేతికత, మరియు తెలివైన ఇంజనీరింగ్ తో ఆరోగ్యకరమైన, శక్తినిచ్చే మధ్యాహ్న భోజనాన్ని అందిస్తోంది.

తాజాగా వండిన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రతి రోజూ నిరుపేదలైన 18 లక్షల మంది బాలలకు  సంస్థ సరఫరా చేస్తోంది. దేశంలో తొమ్మిది రాష్ట్రాల్లోని 51వంటశాలల్లో 16,856 ప్రభుత్వ పాఠశాలల్లో ఈ కార్యక్రమం కొనసాగుతోంది.

The Best Way to Make a Difference in the Lives of Others