Akshaya Patra వారి కేంద్రీకృత వంటశాలలు.. భారీ స్థాయిలో వంటలు వండే అంటే.. రోజుకు దాదాపు 1,00,000 భోజనాల వరకు వండే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ప్రతి వంటశాలలో.. ఆహార భద్రత నిర్వహణ వ్యవస్థ ఉంటుంది. ఆహారాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయడం, వండడం మరియు డెలివరీ చేయడానికి వ్యవస్థ దోహదపడుతుంది.
అత్యంత యాంత్రీకరించిన యూనిట్లను ఉపయోగించి Akshaya Patra.. ఆహారాన్ని మనుషులు నేరుగా తాకే అవకాశాన్ని తగ్గించడం ద్వారా అత్యంత ఉన్నత స్థాయి పరిశుభ్రతను పాటిస్తోంది. వంట వండాక, స్వచ్ఛమైన ఉక్కు కంటెయినర్లలో ఆహారాన్ని ప్యాక్ చేస్తారు. తర్వాత కన్వేయర్ బెల్టుల ద్వారా అవసరాల మేరకు మార్పులు చేయబడిన వాహనాలకు చేరవేస్తారు. వాటి ద్వారా సంబంధిత పాఠశాలలకు చేరవేస్తారు.