పారదర్శకత
నమ్మకానికి, విశ్వసనీయతకు కీలకం పారదర్శకత. తాను చేసే అన్ని కార్యకలాపాల్లోనూ సంపూర్ణ పారదర్శకత ఉండాలని Akshaya Patra ఫౌండేషన్ విశ్వసిస్తుంది. ఈ సిద్ధాంతాన్ని దృష్టిలో ఉంచుకుని.. అంతర్జాతీయ ఆర్థిక నివేదికల రూపకల్పన ప్రమాణాల(ఐఎఫ్ఆర్ఎస్)ను మేం పాటిస్తాం. 2008-09 నుంచే మేం ఐఎఫ్ఆర్ఎస్ ప్రమాణాలను అమలు చేస్తున్నాం. సంస్థ భాగస్వాముల్లో గణనీయంగా విశ్వాసాన్ని కల్పించడంలో ఇది మాకు ఎంతో తోడ్పడింది.
ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) జారీ చేసిన ఇండియన్ అకౌంటింగ్ ప్రమాణాలను కూడా మేం పాటిస్తాం. అకౌంటింగ్, ఫైనాన్షియల్ రిపోర్టింగ్ లో కొత్త కొత్త ప్రమాణాలను అందిపుచ్చుకోవడంలో సంస్థ ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటుంది. వాటి సహకారంతో ప్రెజెంటేషన్ల నాణ్యతను గణనీయంగా మెరుగుపరుస్తుంది. ప్రతి ఆర్థిక సంవత్సరం చివర్లో, ఫైనాన్షియల్ ఆడిట్స్, స్టేట్ మెంట్లతో కూడిన ఆడిట్ రిపోర్టును సంస్థ ప్రచురిస్తూ ఉంటుంది. భాగస్వాములు అందరికీ దానిని అందుబాటులో ఉంచుతుంది.
పారదర్శకతపై నిరంతరం ప్రత్యేక దృష్టి సారించడం ద్వారా ఎన్నో అభినందనలు అందుకున్నాం. గుర్తింపులు సాధించాం. వాటిలో కొన్ని..
- వరుసగా ఐదేళ్లపాటు ‘ఫైనాన్షియల్ రిపోర్టింగ్ లో ఎక్స్ లెన్స్’క ఐసీఏఐ గోల్డ్ షీల్డ్ అవార్డు అందుకున్నాం. దాంతో, ఐసీఏఐ హాల్ ఆఫ్ ఫేమ్ లో సంస్థకు చోటు లభించింది.
- సౌత్ ఏసియన్ ఫెడరేషన్ ఆఫ్ అకౌంటెంట్స్ (ఎస్ఏఎఫ్ఎ) గోల్డ్ అవార్డు 2011-12
- మూడు సంవత్సరాలపాటు ఎన్జీవో విభాగంలో ఔట్ స్టాండింగ్ యాన్యువల్ రిపోర్టు సమర్పించినందుకు సీఎస్వో పార్ట్ నర్స్ అవార్డు.
- వరుసగా రెండేళ్లపాటు లీగ్ ఆఫ్ అమెరికన్ కమ్యూనికేషన్స్ ప్రొఫెషనల్స్ (ఎల్ఏసీపీ) విజన్ అవార్డులో గోల్డ్ అవార్డు
పరిపాలనా తత్వం మరియు పారదర్శక సిద్ధాంతాన్ని పాటిస్తూ సంస్థ 2013-14 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక నివేదికను ప్రచురించింది. వార్షిక నివేదిక 2013-14 ఆన్ లైన్ వెర్షన్ ను దయచేసి ఇక్కడ నుంచి అందుకోండి.
The Akshaya Patra Foundation © 2017