భౌగోళిక స్వరూపం మరియు రోడ్ల అనుసంధానం బాగా లేకపోవడం వంటి సమస్యలున్న చోట్ల భారీ స్థాయి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం కష్టం. అలాంటి చోట్ల వికేంద్రీకృత విధానంలో వంటశాలలు ఏర్పాటు చేశాం. Akshaya Patra మార్గదర్శకత్వంలో వంట వండే మహిళా స్వయం సహాయక బృందాలు(ఎస్ హెచ్ జీలు) ఈ వంటశాలలు నిర్వహిస్తాయి.
ఈ బృందాల సభ్యులకు Akshaya Patra వంటశాలల ప్రక్రియ మరియు ఆపరేషన్ మాడ్యూల్ లపై శిక్షణ ఇస్తారు. అలాగే మధ్యాహ్న భోజన పథకంలో పిల్లలకు భద్రమైన, బలవర్ధకమైన ఆహారం పెడుతున్నారా లేదా అన్నది పరిశీలించడానికి Akshaya Patra ప్రతినిధులు నిరంతరం పర్యవేక్షిస్తుంటారు.